Revanth Reddy 2780 crore scheme 2025: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారు ముఖ్యమంత్రి ఏ రెవంత్ రెడ్డి. ₹2,780 కోట్ల విడుదల చేసి, 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2,432 పనులు చేపట్టనున్నారు.
ఈ పనులు మార్చి 2026 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

నిధుల విడుదల: ప్రాధాన్యత ప్రకారం
- కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు: ₹15 కోట్లు
- గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు: అదనంగా ₹15 కోట్లు
- పాత మున్సిపాలిటీలకు: ₹20 కోట్లు మరియు ₹15 కోట్లు
- కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు: ₹30 కోట్లు
ఈ నిధులు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (UIDF) మరియు రాష్ట్ర బడ్జెట్ లోని అర్బన్ డెవలప్‌మెంట్ ఫండ్స్ నుండి కేటాయించారు.
Note: Telangana Core Urban City projects are funded separately.
పనుల ప్రాధాన్యతలు
మున్సిపల్ శాఖ నిధుల ఉపయోగంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది:
- మున్సిపాలిటీలలో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి
- అంతర్గత రోడ్ల నిర్మాణం
- వర్షపు నీటి, మురుగు నీటికి డ్రైనేజ్ వ్యవస్థలు
- జంక్షన్ల అభివృద్ధి
- చెరువులు, చిన్న చెరువులలో కాలుష్యం నిరోధం
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించిన ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాలు
- పార్కుల అభివృద్ధి
- కల్వర్ట్ల నిర్మాణం
- షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం
తెలంగాణ రైజింగ్ విజన్ 2027
ఈ పథకం “తెలంగాణ రైజింగ్ విజన్ 2027” లో భాగం. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలను అభివృద్ధి హబ్స్ గా తీర్చిదిద్దాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు.
పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
