Advertisement

RCB WON IPL 2025: విరాట్ కోహ్లీ కల నిజమైంది | 18 సంవత్సరాల క్వైట్‌కి ముగింపు

Telanganapatrika (June 3): RCB WON IPL 2025, భారత క్రికెట్ చరిత్రలో ఓ గుర్తుండిపోయే రోజు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుని 18 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
RCB WON IPL 2025 latest news update all details

RCB WON IPL 2025 latest news

18 నంబరుకు ప్రత్యేక ప్రాధాన్యం

ఈ గెలుపులో 18 నంబర్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

Advertisement
  • ఇది 18వ ఐపీఎల్ సీజన్
  • విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18
  • ఆర్సీబీ స్థాపన 2008… ఇప్పటికి 18 ఏళ్లు

ఈ గణాంకాలు ఈ విజయాన్ని మరింత భావోద్వేగపూరితంగా మార్చాయి.

ఫైనల్ మ్యాచ్ హైలైట్స్

RCB WON IPL 2025 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకున్నారు.
బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ పంజాబ్ ముందు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

అనంతరం బాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు శురువులోనే తడబడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం ఒక్క పరుగుకే అవుట్ కావడంతో పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.

శశాంక్ సింగ్ పోరాటం పనికిరాలేదు

పంజాబ్ తరఫున శశాంక్ సింగ్ చివర్లో హిట్ చేసేందుకు ప్రయత్నించినా, అప్పటికే మ్యాచ్ RCB చేతుల్లోకి వెళ్ళిపోయింది. శశాంక్ భారీ సిక్సర్లతో ఆకట్టుకున్నప్పటికీ విజయం దక్కలేదు.

కోహ్లీ కన్నీటి పర్యంతం

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ కన్నీటిని ఆపలేకపోయాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయం, తన కెరీర్‌కు గర్వకారణంగా నిలిచిన ఈ ట్రోఫీ అభిమానుల మనసులను తాకింది. అతని భావోద్వేగాలు అభిమానుల్లో ఆనందజలధిని పెంచాయి.

అభిమానుల స్పందన

RCB అభిమానులు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. బెంగళూరు వీధుల్లో హారన్లు మోగించుకుంటూ విజయోత్సవాలు జరుపుకున్నారు.
“ఇది కేవలం గెలుపు కాదు, నమ్మకానికి గెలుపు,” అని అభిమానులు పేర్కొన్నారు.

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →

Comments are closed.