పంచాయతీ సెక్రటరీ అరెస్ట్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో అవినీతి ఘటన వెలుగుచూసింది. ఇల్లంతకుంట మండలంలోని ఓగులాపూర్ గ్రామ పంచాయతీ మాజీ కార్యదర్శి సయ్యద్ ముక్తార్ అహ్మద్ ప్రభుత్వ నిధులను వ్యక్తిగత అవసరాలకు వాడినట్లు తేలింది.

2025 జనవరి నుండి మే వరకు పనిచేసిన ఐదుగురు మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు చెల్లించకుండా, ఆ మొత్తం రూ.1.42 లక్షలు స్వాహా చేసినట్లు విచారణలో బయటపడింది.
పంచాయతీ సెక్రటరీ అరెస్ట్ వివరాల్లోకి వెళ్తే
బాధితులు జీతాలు అందకపోవడంతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పంచాయతీ రాజ్ అధికారులు విచారణ జరిపి, సయ్యద్ ముక్తార్ అహ్మద్ ఐదు వేర్వేరు చెక్కుల ద్వారా డబ్బు డ్రా చేసుకుని, వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు నిర్ధారించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
