President Murmu Hyderabad Visit: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 21న ఆమె నగరానికి రానుండటంతో అధికార యంత్రాంగం అన్ని విభాగాలను అలర్ట్ చేసి ప్రణాళికలను అమలు చేస్తోంది.

బెగంపేట ఎయిర్‌పోర్ట్‌కు రానున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ముర్ము నవంబర్ 21 మధ్యాహ్నం బెగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా రాజ్ భవన్‌కు వెళ్లి స్వల్ప విరామం తీసుకోనున్నారు.
రాష్టప్రతి నిలయంలో ‘భారతీయ కళా మహోత్సవం’లో పాల్గొననున్న రాష్ట్రపతి
సాయంత్రం, బోలారంలోని రాష్టప్రతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థలు, కళారంగ ప్రతినిధులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి రాత్రంతా రాజ్ భవన్‌లోనే ఉండనున్నారు. భద్రతా దళాలు, పోలీసు శాఖ, రాష్ట్రపతి భవన్ అధికారులు సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
President Murmu Hyderabad Visit మరుసటి రోజు పుట్టపర్తికి బయలుదేరు
నవంబర్ 22 ఉదయం, రాష్ట్రపతి ముర్ము పుట్టపర్తికి బయలుదేరనున్నారు. హైదరాబాద్ పర్యటనలో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు మొత్తం ప్రణాళికను కట్టుదిట్టం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
