Polycet Exam Centers in Siddipet – 3801 మంది విద్యార్థుల కోసం 8 పరీక్షా కేంద్రాలు సిద్ధం..!

Follow us

TELANGANA PATRIKA (MAY 11) , Polycet Exam Centers in Siddipet :రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ 2025 పరీక్ష మే 13న జరుగనుంది. Polycet exam కోసం సిద్ధిపేట మరియు గజ్వేల్ పట్టణాల్లో మొత్తం 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ పరీక్షకు మొత్తం 3801 మంది విద్యార్థులు హాజరవుతుండగా, సిద్ధిపేటలో 5 కేంద్రాల్లో 2606 మంది, గజ్వేల్ లో 3 కేంద్రాల్లో 1195 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

Advertisement

Polycet Exam Centers in Siddipet పరీక్షకు సంబంధించిన ముఖ్య సమాచారం:

  • పరీక్ష తేదీ: మే 13
  • సమయం: ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు
  • పరీక్ష హాలుకు ప్రవేశం: ఉదయం 10:00 నుంచి మాత్రమే
  • నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదు

Polycet Exam Centers in Siddipet సిద్ధిపేట కేంద్రాలు:

  • చిన్నకోడూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ – 500 మంది
  • పొన్నాల ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాల – 456 మంది
  • సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల A-కేంద్రం – 600 మంది
  • సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల B-కేంద్రం – 600 మంది
  • ప్రతిభ డిగ్రీ కళాశాల – 450 మంది
గజ్వేల్ కేంద్రాలు:
  • ప్రభుత్వ ఆదర్శ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ – 350 మంది
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర హబ్) – 400 మంది
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల (బాలుర హబ్) – 445 మంది

అభ్యర్థులకు సూచనలు:

  1. హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి
  2. HB పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ ఇంక్ బాల్ పెన్ తీసుకురావాలి
  3. సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు
  4. ఓఎంఆర్ షీట్ పై రెండు వైపులా వివరాలు సరిగ్గా నింపాలి

Polycet exam centers in Siddipet కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి కావడంతో అధికారులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More: Read Today’s E-paper News in Telugu

ఈ వార్తను షేర్ చేయండి!

మీ స్నేహితులకు, బంధువులకు పంపండి 👇

వాట్సాప్‌లో షేర్ చేయండి
Advertisement

About Telangana Patrika Team

The Telangana Patrika Team leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, public issues, and trending schemes, the team ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, the Telangana Patrika Team blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Telangana Patrika Team →