TELANGANA PATRIKA (MAY 11) , Polycet Exam Centers in Siddipet :రాష్ట్రంలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ 2025 పరీక్ష మే 13న జరుగనుంది. Polycet exam కోసం సిద్ధిపేట మరియు గజ్వేల్ పట్టణాల్లో మొత్తం 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ పరీక్షకు మొత్తం 3801 మంది విద్యార్థులు హాజరవుతుండగా, సిద్ధిపేటలో 5 కేంద్రాల్లో 2606 మంది, గజ్వేల్ లో 3 కేంద్రాల్లో 1195 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
Polycet Exam Centers in Siddipet పరీక్షకు సంబంధించిన ముఖ్య సమాచారం:
- పరీక్ష తేదీ: మే 13
- సమయం: ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు
- పరీక్ష హాలుకు ప్రవేశం: ఉదయం 10:00 నుంచి మాత్రమే
- నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదు
Polycet Exam Centers in Siddipet సిద్ధిపేట కేంద్రాలు:
- చిన్నకోడూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ – 500 మంది
- పొన్నాల ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాల – 456 మంది
- సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల A-కేంద్రం – 600 మంది
- సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల B-కేంద్రం – 600 మంది
- ప్రతిభ డిగ్రీ కళాశాల – 450 మంది
గజ్వేల్ కేంద్రాలు:
- ప్రభుత్వ ఆదర్శ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ – 350 మంది
- ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర హబ్) – 400 మంది
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల (బాలుర హబ్) – 445 మంది
అభ్యర్థులకు సూచనలు:
- హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి
- HB పెన్సిల్, ఎరేజర్, బ్లూ లేదా బ్లాక్ ఇంక్ బాల్ పెన్ తీసుకురావాలి
- సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు
- ఓఎంఆర్ షీట్ పై రెండు వైపులా వివరాలు సరిగ్గా నింపాలి
Polycet exam centers in Siddipet కు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి కావడంతో అధికారులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu