ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈనెల అక్టోబర్ 16న ప్రధాని రాష్ట్ర పర్యటనలో పాల్గొననున్నారు. మోదీ పర్యటనలో ఆధ్యాత్మిక దర్శనం, ప్రజా సభ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా ఉండనున్నాయి.

ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన షెడ్యూల్ వివరాలు
- 7:50 AM – ఢిల్లీ నుంచి విమాన ప్రయాణం ప్రారంభం
- 10:20 AM – కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరిక
- 11:10 AM – రోడ్డుమార్గం ద్వారా శ్రీశైలం బయల్దేరుతారు
- 11:45 AM – శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో దర్శనం
- 1:40 PM – సున్నిపెంట నుంచి నన్నూరు హెలిప్యాడ్ చేరుకుంటారు
- 4:00 PM – నన్నూరు టోల్ ప్లాజా వద్ద బహిరంగ సభలో పాల్గొనడం
- 4:40 PM – కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి చేరుకుని, ఢిల్లీకి పయనం
ఆధ్యాత్మికతతో ప్రారంభమయ్యే పర్యటన
శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనంతో మోదీ పర్యటన ప్రారంభం కానుంది. అనంతరం కర్నూలు జిల్లాలో జరిగే బహిరంగ సభలో ప్రజలకు ప్రసంగించనున్నారు.
జిల్లా ప్రజలు
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు ఈ సందర్శనను చారిత్రాత్మకంగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
