Petrol Diesel Price Hike : సామాన్యులకు మరో దెబ్బ… 10 రోజుల్లో రూ.5 వరకు పెరిగిన ఇంధన ధరలు

Petrol Diesel Price Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గత 10 రోజుల్లో ఇది మూడోసారి ధరల పెంపు కావడంతో సాధారణ ప్రజలు, వాహనదారులపై భారీ భారం పడుతోంది.

శనివారం విడుదలైన తాజా ధరల ప్రకారం, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 87 పైసలు పెరిగి రూ.99.51కి చేరుకుంది. డీజిల్ ధర 91 పైసలు పెరిగి రూ.92.49గా నమోదైంది.

Advertisement

Petrol Diesel Price Hike 2026

ఇప్పటికే మే 15న ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు లీటర్‌కు రూ.3 పెంచగా, మే 19న మరో 90 పైసలు పెంచాయి. తాజా పెంపుతో కలిపి మొత్తం 10 రోజుల్లో దాదాపు రూ.5 వరకు ఇంధన ధరలు పెరిగినట్టైంది.

Advertisement

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఆయిల్ కంపెనీలు దశలవారీగా ధరలు పెంచుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →