స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే తో కలిసి సబ్సిడీ పై పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శుక్రవారం పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఉన్న గోడౌన్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తోకలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రైతులకు సబ్సిడీ పై పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,రైతులకు 50% రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాబోయే వానాకాలం పంట కోసం 51 సేల్స్ పాయింట్ వద్ద ఆన్ లైన్ ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.మన పెద్దపల్లి జిల్లాలో 6 వేల క్వింటాల్లో జీలుగ , 600 క్వింటాళ్ల జనుము విత్తనాలు సబ్సిడీపై పంపిణీ కోసం కేటాయించడం జరిగిందని అన్నారు.
జీలుగ 30 కేజీల బస్తా పై 7125 రూపాయల, జనుము 40 కేజీల బస్తా పై 6275 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.పంట మార్పిడి లో భాగంగా పచ్చిరొట్ట ఎరువులను పెంచడం సేంద్రియ వ్యవసాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం అని నేల సారాన్ని పెంపొందించడంలో సహాయ పడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంటవిజయ రమణారావు మాట్లాడుతూ, రైతులకుపచ్చి రొట్టె జీలుగుజనుము విత్తనాలు సబ్సిడీ పై గతం కంటే పెద్ద ఎత్తున ముందస్తుగానే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను రైతులు సద్వినియోగంచేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
వ్యవసాయ శాస్త్రజ్ఞులు పెద్ద ఎత్తున రైతులకు నేరుగా ఆధునిక సాగు పద్ధతుల పై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. రైతులకు నాణ్యమైన పంట పండే విధంగా భూముల సారం కోల్పోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల పై శాస్త్రజ్ఞులు గ్రామాలకు పంపే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.ప్రతి మండల కేంద్రంలో రైతులకు భూసారం కోల్పోకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆది రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : Ration news Telangana : మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ..!
Comments are closed.