
sridhar babu it minister: పెద్దపల్లి జిల్లాలో అకాల వర్షాల కారణంగానష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. పంటలు నష్టపోయిన, దెబ్బతిన్న రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఈ అకాల వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా, ధాన్యం, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతిన్నాయని, రైతులకు త్వరలోనే పరిహారం అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని, పంట నష్టం అంచనాలను సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించా.