PD Act In Vemulawada: ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పునరావృత నేరాలకు పాల్పడుతున్న నలుగురు యువకులపై పబ్లిక్ డెతెన్షన్ యాక్ట్ (PD Act) ను జిల్లా పోలీసులు అమలు చేశారు. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

PD Act In Vemulawada నిందితుల వివరాలు:
- బైరెడ్డి వినయ్ (28) – కోనయ్యపల్లి, వేములవాడ
- ఈర్ల సాయి (24) – ఉప్పుగడ్డ, వేములవాడ టౌన్
- వస్తాద్ అఖిల్ (22) – ఉప్పుగడ్డ, వేములవాడ
- నేదూరి రాజేష్ (30) – బాలరాజ్‌పల్లి, వేములవాడ రూరల్
ఈ నలుగురు గతంలో గంజాయి, హత్యాయత్నం, హత్య కేసులలో నిందితులుగా ఉండి శిక్షలు అనుభవించినప్పటికీ, తిరిగి నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.
అధికారులు తీసుకున్న చర్యలు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో, వేములవాడ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ నేతృత్వంలో నిందితులకు పిడి యాక్ట్ నోటీసులు అందజేసి సోమవారం నాడు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
ఎస్పీ హెచ్చరిక
జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎటువంటి ఉపేక్ష ఉండదని, రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు. “తరచూ నేరాలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తాం. ప్రజల భద్రతకు బద్ధతగా పనిచేస్తాం” అని హెచ్చరించారు.
Read More: Read Today’s E-paper News in Telugu