RGIA Wildlife Seizure, హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద శనివారం బ్యాంకాక్ నుండి వచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సూట్‌కేస్ పరిశీలన సమయంలో, అధికారులు ఒక మానిటర్ లిజార్డ్, రెండు తలలు ఉన్న రెడ్ ఈయర్ స్లైడర్ తాబేలు, నాలుగు గ్రీన్ ఇగ్వానాలు మరియు 12 ఇగ్వానాలను గుర్తించారు. ఇవన్నీ వన్యప్రాణుల సంరక్షణ చట్టాల కింద రక్షిత జాతులు. ఈ జీవులను చెక్ ఇన్ బ్యాగేజిలో దాచి ఉంచారు. వెంటనే ఆ జీవులను స్వాధీనం చేసుకుని తిరిగి బ్యాంకాక్‌కు పంపించారు. కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.
Also Read: Car Fire Incident | గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై కారు మంటల్లో దహనం.
