Telanganapatrika (July 27): PACS , జిల్లాలోని గుడిహత్నూర్, బోథ్ మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) కేంద్రాలు, గోదాములను ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ , జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి సందర్శించారు.

PACS వ్యవసాయ గోదాముల్లో అసలు పరిస్థితి ఏంటి? – అధికారుల రివ్యూ..
ఈ సందర్భంగా PACS కేంద్రాల్లో అమలవుతున్న ఆన్‌లైన్ పేమెంట్ విధానం, ఎరువుల నిల్వలు, పంపిణీ తదితర అంశాలను సమీక్షించారు. PACS , ARSK వంటి దుకాణాల్లో సరిపడా ఎరువుల నిల్వలు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఎరువుల దుకాణంలో గత వారపు సగటు అమ్మకాలను ఆధారంగా చేసుకుని రానున్న నాలుగు రోజుల అవసరాన్ని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే e-POS మెషీన్‌ల ద్వారా ఎరువుల అమ్మకాల వివరాలను తన ఆధార్ కార్డుతో స్వయంగా పరిశీలించారు. సాంకేతికత వినియోగం ద్వారా వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తున్న PACS సిబ్బంది పనితీరును ఆయన ప్రశంసించారు.
Read More: Read Today’s E-paper News in Telugu