NEET UG 2026 Telangana : తెలంగాణలో మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం అత్యంత కీలకమైన NEET UG 2026 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి మొత్తం 73,084 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంఖ్య కొద్దిగా పెరిగింది.

NEET UG 2026 Telangana
రాష్ట్రవ్యాప్తంగా 199 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు , ఈ కేంద్రాలన్నీ ప్రభుత్వ విద్యాసంస్థలలోనే ఏర్పాటు చేయడం ప్రత్యేకం ఏ ఒక్క మెడికల్ కాలేజ్‌ను పరీక్ష కేంద్రంగా ఉపయోగించలేదు.
పరీక్ష తేదీ & విధానం
పరీక్ష తేదీ: మే 3, 2026 (ఆదివారం)
పరీక్ష విధానం: ఆఫ్‌లైన్ (పెన్-అండ్-పేపర్ మోడ్)
భద్రతా చర్యలు కట్టుదిట్టం
ఈసారి పరీక్షను ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంది:
ప్రతి కేంద్రంలో CCTV కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సిగ్నల్ జ్యామర్లు, ప్రశ్నాపత్రాలు బ్యాంకుల్లో భద్రపరిచి ధృవీకరణ, ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలు పరీక్ష నిర్వహణకు రెండు స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేశారు , రాష్ట్ర స్థాయి కమిటీ , జిల్లా స్థాయి కమిటీ ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పోలీస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. పరీక్ష నిర్వహణ సిబ్బంది అన్ని కేంద్రాల్లో ప్రభుత్వ సిబ్బందినే ఇన్విజిలేటర్లుగా నియమించారు,ఎటువంటి ప్రైవేట్ స్టాఫ్‌కు అనుమతి లేదు.
- విద్యార్థులకు సూచనలు
- హాల్ టికెట్, ID ప్రూఫ్ తప్పనిసరి
- పరీక్షకు కనీసం 1 గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి
- నిషేధిత వస్తువులు తీసుకురావద్దు
ఈసారి NEET UG 2026 పరీక్షను తెలంగాణ ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు నమ్మకమైన పరీక్ష వాతావరణం లభించనుంది.
Read More: Read Today’s E-paper News in Telugu
