Telanganapatrika (జూలై 24): NEET Local Quota Telangana 2025, దిల్లీ/హైదరాబాద్: నీట్ లోకల్ కోటా వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సమస్య వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరిష్కారం కనుగొనాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేసింది.

తెలంగాణలో నాలుగు వరుస సంవత్సరాలు చదివిన విద్యార్థులకే NEETలో స్థానిక కోటా వర్తిస్తుందనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే గత ఏడాది తెలంగాణ హైకోర్టు ఈ నిబంధనలను చెల్లవని పేర్కొంది.
ఈ హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆపీల్ చేసింది. గత ఏడాది పిటిషన్ దారులకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం, ఈసారి కూడా విద్యార్థులు అదే మినహాయింపును కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్లవాక్యానుసారం: “మేము తెలంగాణలో జన్మించి పదవ తరగతి వరకు చదివాం. కానీ ఇంటర్మీడియట్‌ను ఇతర రాష్ట్రాల్లో చదివిన కారణంగా లోకల్ కోటా వర్తించడం లేదు.” విద్యార్థులు తమకు లోకల్ కోటా లభించకపోతే నీట్ అడ్మిషన్లలో నష్టపోతామని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ఆమోదిస్తూ, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది.
Read more: Hari Hara Veera Mallu Review 2025 Telugu : పవన్ కళ్యాణ్ చరిత్రాత్మక విజయం.

7 Comments on “NEET Local Quota Telangana 2025: లోకల్ కోటాపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.”