TELANGANAPATRIKA (June 27): Municipality 100 Days Plan. పురపాలక అభివృద్ధి దిశగా మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న 100 రోజుల ప్రణాళికలో భాగంగా, నేరేడుచర్ల పురపాలక సంఘం కీలక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాదు ఇచ్చిన ఆదేశాల మేరకు జూన్ 2 నుండి సెప్టెంబర్ 10 వరకు ఈ ప్రణాళిక అమలులో ఉంది.

Municipality 100 Days Plan డెంగ్యూ & మలేరియాపై అవగాహన ర్యాలీ..
- జూన్ 27, శుక్రవారం నాడు 26వ రోజు కార్యక్రమంగా
- వివిధ వార్డుల్లో డెంగ్యూ, మలేరియాపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
- ప్రతి శుక్రవారాన్ని “డ్రై డే” గా పాటించాలని ప్రజలకు సూచించారు.
- మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, మలాథియాన్ స్ప్రేయింగ్ ద్వారా దోమల నిర్మూలన చేపట్టారు.
నిరుపేద మహిళలకు SHG ఏర్పాట్లు
పట్టణంలోని నిరుపేద మహిళలను గుర్తించి Self Help Groups (SHGs) ఏర్పాటు చేయడం కోసం మెప్మా అర్పిలు సర్వే చేపట్టారు.
స్ట్రీట్ వెండార్లకు CIG గ్రూపుల ఏర్పాటు దిశగా కూడా కార్యాచరణ ప్రారంభించారు.
నల్లా కనెక్షన్లు & ట్రేడ్ లైసెన్స్ స్పెషల్ డ్రైవ్
2వ వార్డులో:
ఆన్లైన్ కనెక్షన్ లేని ఇండ్లను గుర్తించగా
ట్రేడ్ లైసెన్స్ తీసుకోని వ్యాపారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
దరఖాస్తులు స్వీకరించి లైసెన్సింగ్ ప్రక్రియ ప్రారంభించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో , కమిషనర్ యడవెల్లి అశోక్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది, వార్డు అధికారులు, మెప్మా అర్పిలు, ప్రజా ప్రతినిధులు, SHG సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu