మొంథా తుఫాను నష్టపరిహారం: తుఫాను మొంథా తెలంగాణ (Telangana) లో పంటలను నాశనం చేసిన నేపథ్యంలో, ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ సమాచారం ప్రకారం, ఎకరాకు ₹10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ప్రాథమిక నివేదిక సిద్ధం
ప్రభుత్వానికి ఇప్పటికే జిల్లావారీగా పంట నష్టం అంచనా వివరాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వరి, పత్తి, మక్కజొన్న, మిరప వంటి పంటలు భారీగా దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
అక్టోబర్ 31 నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్
అక్టోబర్ 31 నుంచి గ్రామస్థాయిలో రైతుల పంట నష్టాలను గుర్తించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యక్ష సర్వేలు ప్రారంభించనున్నారు. ప్రతి రైతు వివరాలు, పంట రకం, నష్ట పరిమాణం వంటి సమాచారం రికార్డ్ చేయనున్నారు.
వర్షపాలైన వరి కొనుగోలు చర్యలు
వర్షాలతో తడిసిన వరి కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. రైతులు ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు, వరి, మక్కజొన్న కొనుగోలు చర్యలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం సుమారు 11 లక్షల టన్నుల మక్కజొన్న కొనుగోలు ప్రణాళికలో ఉంది.
మొంథా తుఫాను నష్టపరిహారం రైతులలో ఆశాభావం
ఈ నిర్ణయంతో తుఫానుతో పంటలు కోల్పోయిన వేలాది మంది రైతులు కొంత ఊరట పొందే అవకాశం ఉంది.
రైతు సంఘాలు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించాయి. అయితే, నష్టపరిహారం త్వరగా విడుదల చేయాలని రైతులు కోరుతున్నా
Read More: Read Today’s E-paper News in Telugu
