Telangana patrika (May 31): ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు, గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు, ఇల్లు లేని పేదవారికి ఒక్క ఇల్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన తీరు దోచుకోవడానికి డ్యాములు కట్టినట్టు కట్టి అమాయక ప్రజలను కేసుల్లో ఇరికించి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను పక్కనపెట్టి, వందలాది మంది యువత బలిదానాల అనంతరం గద్దెను ఎక్కి నిరుపేద కుటుంబాలతో చెలగాటమాడిన బిఆర్ఎస్ నేతల నియంత పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలన్ని దివాలా తీశాయని అన్నారు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన పథకాలను తీసుకువచ్చామని పేదోళ్ల కడుపు చూసి సన్న బియ్యంతో అన్నం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు, కాంగ్రెస్ ప్రజాపాలనలో కక్షలు కార్పన్యాలకు తావివ్వకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్లామని తెలిపారు,జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైంది అన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి,?

ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే రైతన్నలకు ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలియజేయండి.? మన ప్రభుత్వంలో ప్రతి నెల పేదోడి కరెంట్ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందని గుర్తు చేయండి.? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, నీడలేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి కట్టిస్తున్నామని వివరించండి.? వడ్లు పండించిన రైతన్నల బ్యాంకు ఖాతాలో బోనస్ వేసిందని గుర్తు చేయండి,? సుమారు 500 కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గ రూపు రేఖలు మారుతున్నాయని అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయండి? పార్టీలు వర్గాలు చూడకుండా అర్హులు అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని లబ్ధిదారులను చూపించండి.? జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చర్చించండి.?
ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించామని రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ పథకాలు అమలవుతాయని తెలిపారు, నియోజకవర్గంలో రాత్రింబగళ్లు అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతూ ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రుల దగ్గరకు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు వివరించి పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. దశాబ్దాలుగా కల్లూరు ప్రజల చిరకాల కోరికను భుజానికి ఎత్తుకున్న ఎమ్మెల్యే దంపతులు అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తూ కల్లూరు పంచాయతీని మున్సిపాలిటీగా మార్చిన ఘనత ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కే చెందుతుందని ప్రజలు చర్చించుకోవడం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తోపాటు సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి, చర్చించండి,
సమస్యలుంటే తనకు తెలియజేయండి అంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేసి తీరుతామని చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలలో అగ్ర తాంబూలం సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చేలా అహర్నిశలు కృషి చేస్తున్నామని రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో పథకాలన్నీ అమలయ్యేలా ముఖ్యమంత్రి రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు మరిన్ని కొత్త పథకాలపై అధ్యయనం చేస్తున్నారని అన్నారు,గత ప్రభుత్వ పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలన్నీ నాశనం చేశారని గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 15 వేల కోట్లు వడ్డీలు కట్టడానికి సరిపోతుందని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!