Telanganapatrika (June 30): Minister Ponnam. బీజేపీ ఫ్యూడల్ పార్టీ – బీసీలకు పదవులు దక్కడం కలలే!” అని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హుస్నాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ మరోసారి బీసీలకు అన్యాయం చేసినందుకు దేశవ్యాప్తంగా గళమెత్తే స్థితి వచ్చిందన్నారు.

Minister Ponnam బీసీ ఎమ్మెల్యేలు ఉన్నా.. అధ్యక్ష పదవి దక్కలేదని విమర్శ
బీజేపీలో ముగ్గురు బీసీ ఎంపీలు, అనేకమంది సీనియర్ బీసీ నేతలు ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్ష పదవిని బీసీ నేతలెవరికీ ఇవ్వకపోవడం నిరంకుశత్వానికి నిదర్శనమని మంత్రి విమర్శించారు. ఒక బీసీ అభ్యర్థి నామినేషన్ వేయకముందే అడ్డుకోవడం, అతని మద్దతుదారులను బెదిరించడం అన్యాయంగా భావించాలన్నారు.
“సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం”
బీసీ ల ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి స్పష్టం చేశారు. సీఎం రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీసీల కోసం నినాదాలు జరుగుతున్నాయని, తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిని బీసీ నేతగా నియమించడం ఆ దిశగా పెద్ద అడుగు అన్నారు.
రిజర్వేషన్ల చట్టంతో ముందుంటున్న కాంగ్రెస్
బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని శాసనసభలో ఆమోదించామని, ఇది బీజేపీ చేసేది కాదని మంత్రి స్పష్టం చేశారు. బీసీల గొంతు వినిపించే ఒకే పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.
బండి సంజయ్ ఉదాహరణ
గతంలో బీజేపీ అధ్యక్షుడిగా బీసీ నేత బండి సంజయ్ ఉన్నప్పటికీ ఎన్నికల సమయానికి ఆయనను తొలగించి కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా నియమించారన్న విషయం గుర్తు చేస్తూ, బీజేపీలో బీసీలకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu