Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అత్యాధునిక వంటశాలను నిర్మించనున్నట్టు ప్రకటించారు. రోజుకు రెండు లక్షల మంది భక్తులకు పోషకమైన అన్నప్రసాదం అందించగల సామర్థ్యంతో ఈ వంటశాలను తీర్చిదిద్దనున్నారు.

ఈ వంటశాల శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు అంకితం చేయబడుతుంది. ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో అమలు కానుంది.
ఆధునిక సాంకేతికతతో నిర్మాణం
ఈ కొత్త వంటశాలలో అత్యాధునిక ఆటోమేషన్ సిస్టమ్స్ అమలు చేయబడతాయి. భక్తులకు శుభ్రత, వేగం, మరియు నాణ్యతతో కూడిన అన్నప్రసాదం అందించడమే లక్ష్యం. అంబానీ మాట్లాడుతూ, “తిరుమల భక్తి, కరుణ, సేవలకు ప్రతీక. ఈ ప్రయత్నం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ‘అన్నసేవ’ దృష్టికి మేము భాగస్వాములం కావడం గర్వంగా ఉంది” అన్నారు.
అంబానీ తిరుమల సందర్శన
ఆదివారం ఉదయం ముకేశ్ అంబానీ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అనంతరం ఆయన కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించి రూ.5 కోట్ల విరాళం అందించారు.
Mukesh Ambani ప్రజల స్పందన
తిరుమలలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు భోజనం చేసే నేపథ్యంలో, ఈ వంటశాల ప్రారంభం ఆలయ సేవా వ్యవస్థకు కొత్త దిశ చూపనుంది. స్థానికులు, భక్తులు అంబానీ సేవాభావానికి ప్రశంసలు వెల్లువెత్తిస్తున్నారు
Read More: Read Today’s E-paper News in Telugu
