Maithili Thakur:జీవితంలో అవకాశాలు ఎప్పుడెప్పుడు, ఎలా వస్తాయో ఎవరికీ ముందుగా చెప్పలేం. కొన్ని సార్లు తిరస్కరణలే మనకు పెద్ద విజయాల దారులు చూపిస్తాయి. అలాంటి అద్భుతమైన ప్రయాణానికే ఉదాహరణ మైతిలీ ఠాకూర్. కేవలం 25 ఏళ్ల వయసులోనే బిహార్ చరిత్రలో అత్యంత పిన్న వయసు ఎమ్మెల్యేగా నిలిచిన ఆమె కథ నిజంగా ప్రేరణాత్మకం.

Maithili Thakur సింగింగ్ షోలలో తిరస్కరణలే మొదటి అడ్డంకి
చిన్నప్పటి నుంచే మైతిలీకి సంగీతంపై అపారమైన ఆసక్తి. సరేగమపా, ఇండియన్ ఐడల్ జూనియర్ వంటి ప్రముఖ సంగీత రియాలిటీ షోల కోసం ఆమె ఎన్నిసార్లు ఆడిషన్స్ ఇచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ప్రతి సారీ ఆమెకు నిరాశే ఎదురైంది. షోలలో చోటు దక్కకపోవడం ఆమె కలలను క్షణార్ధంలో దెబ్బతీసింది.
సోషల్ మీడియాలో పసి స్వరానికి విపరీత స్పందన
ఎన్ని తిరస్కరణలు వచ్చినా వెనక్కి తగ్గని మైతిలీ, సోషల్ మీడియాను తన వేదికగా మల్చుకుంది. పాటలు, ఫోక్ సాంగ్స్, భజనలతో ఆమె యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ఒకప్పుడు రియాలిటీ షోలలో తిరస్కరించిన ఈ స్వరం, కోట్లాది మంది అభిమానులను పొందింది.
రాజకీయాల్లో ప్రవేశం… ఆపై చరిత్ర సృష్టి
కొద్ది నెలల క్రితం మైతిలీ ఠాకూర్ BJPలో చేరింది. అంచనాలు లేని స్థితి నుండి, అలీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి, అద్భుత మెజారిటీతో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం సంగీతంలోనే కాదు, ప్రజా సేవలో కూడా తనదైన ముద్ర వేసిన మైతిలీ, ఇప్పుడాయన బిహార్ రాజకీయాల్లో కొత్త తరానికి ప్రతీకగా నిలుస్తోంది.
ఒక తిరస్కరణ… ఒక అవకాశమే
సంగీత కార్యక్రమాల్లో వచ్చిన తిరస్కరణలు ఆమెను నిరుత్సాహపరచలేదు. సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు 25 ఏళ్లకే చరిత్ర సృష్టించడం—ఈ ప్రయాణం ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం.
Read More: Read Today’s E-paper News in Telugu

One Comment on “Maithili Thakur : సంగీత కార్యక్రమాల్లో తిరస్కరణ…25 ఏళ్లకే MLA”
Comments are closed.