Telanganapatrika (July 23): Mahalakshmi Scheme , తెలంగాణలో మహిళల కోసం ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటివరకు మహిళలు రూ.200 కోట్ల విలువైన ప్రయాణాలు ఉచితంగా చేశారు. ఈ ఘనతను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు .

Mahalakshmi Scheme ఉచిత బస్సు ప్రయాణాల్లో మహిళల చరిత్రాత్మక రికార్డు మహాలక్ష్మి మేజిక్..!
తెలంగాణ ప్రభుత్వ పథకాల్లో ఒకటైన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.200 కోట్ల విలువైన టికెట్లు ఉచితంగా మంజూరయ్యాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సగటున 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ విజయాన్ని పురస్కరించుకుని, ఇవాళ రాష్ట్రంలోని అన్ని డిపోలు, బస్టాండ్లలో వేడుకలు జరుపుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో డ్రైవర్లు, కండక్టర్లు, ట్రాఫిక్ గైడ్లు, భద్రతా సిబ్బందిని సన్మానించనున్నారు. పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో వీరి పాత్ర కీలకమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
పథకం ముఖ్యాంశాలు:
- రోజూ సగటున 30 లక్షల ఉచిత ప్రయాణాలు
- రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు
- ఇప్పటివరకు ₹200 కోట్ల ప్రయాణాలు ఉచితంగా
- డిపోల స్థాయిలో సంబురాలు, సన్మాన కార్యక్రమాలు
Read More: Read Today’s E-paper News in Telugu