LPG Cylinder Delivery India: దేశంలో గ్యాస్ కొరత వస్తుందా అనే ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది! భారీ సంఖ్యలో LPG సిలిండర్లు ఇప్పటికే డెలివరీ అయ్యాయని తెలిపింది.

LPG Cylinder Delivery India 18 కోట్ల LPG సిలిండర్ల డెలివరీ
Ministry of Petroleum and Natural Gas ప్రకారం, మార్చి 1, 2026 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18 కోట్లకు పైగా LPG సిలిండర్లు విజయవంతంగా డెలివరీ అయ్యాయి. సరఫరా సాధారణంగానే కొనసాగుతోంది మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, దేశంలో LPG సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోంది. Strait of Hormuz సమస్యల మధ్య కూడా సరఫరా స్థిరంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
LPG Cylinder Delivery India డిజిటల్ బుకింగ్స్ పెరుగుదల
ఇప్పుడున్న పరిస్థితుల్లో:
97% LPG బుకింగ్స్ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి.90% డెలివరీలు OTP ఆధారంగా జరుగుతున్నాయి. ఇది అక్రమ వినియోగాన్ని అరికట్టడంలో సహాయపడుతోంది.
బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు
పీఎస్‌యూ ఆయిల్ కంపెనీలు భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టాయి.1 లక్షకు పైగా రైడ్స్ , 52,000 సిలిండర్ల స్వాధీనం దీంతో బ్లాక్ మార్కెటింగ్‌పై కట్టడి పెరిగింది.
బియ్యం, గోధుమల స్టాక్ సరిపడేలా
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం Public Distribution System కోసం సరిపడా బియ్యం, గోధుమల నిల్వలు ఉన్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా సరఫరా కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత
CNG, PNG, ఎరువుల పరిశ్రమలకు గ్యాస్ సరఫరా ప్రాధాన్యతగా కొనసాగుతోంది. ఇక ఎరువుల ప్లాంట్లకు సరఫరా 90% వరకు పెంచే యోచనలో ఉంది. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా… దేశంలో గ్యాస్, ఆహార సరఫరా విషయంలో ఎలాంటి సమస్యలు లేవని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
Read More: Read Today’s E-paper News in Telugu

