పేదల కోసం లారెన్స్ సేవా కార్యక్రమం: సినీ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన తల్లి పేరిట మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదలకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఆయన ‘కన్మణి అన్నదాన విందు’ అనే పథకాన్ని ప్రారంభించారు.

ఆహారంలో సమానత్వం లక్ష్యం
లారెన్స్ మాట్లాడుతూ – “ధనికులు మాత్రమే తినే వంటకాలను పేదలకు అందించడం ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వు చూసాను. ఈ ఆనందమే నాకు నిజమైన తృప్తి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మొదటిగా నారీ కురవర్గల్ కమ్యూనిటీ (సంచార జాతి) పిల్లలు, వృద్ధులతో ప్రారంభమైందని తెలిపారు.
పేదల కోసం లారెన్స్ సేవా కార్యక్రమం
“మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తా” అని లారెన్స్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ మానవతా కార్యక్రమానికి అభిమానులు, సామాజిక వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu

One Comment on “పేదల కోసం లారెన్స్ సేవా కార్యక్రమం”