ఈనెల 16న కుంటాలలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పర్యటన జిల్లా కలెక్టర్ కలెక్టర్ అభిలాష అభినవ్!
Bhu Bharati News: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి గ్రామ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్ని వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కుంటాల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుంటాల మండలాన్ని భూభారతి రెవెన్యూ సదస్సులకు పైలట్ మండలంగా ప్రభుత్వం ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ నెల 16న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుంటాల మండలంలో జరగనున్న భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొననున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగిన సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులు, ఆన్‌లైన్ ప్రక్రియ, సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలపై కలెక్టర్ అధికారులు నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు దరఖాస్తు చేసిన సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని, నూతన భూభారతి చట్టం మేరకు సమస్యలు తక్షణమే పరిష్కరించాల్సిందిగా సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, బైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, తహసీల్దార్లు కమల్ సింగ్, శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్, ఎజాజ్ అహ్మద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More: లక్ష్మీపురంలో అభివృద్ధి పనుల పరిశీలనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Comments are closed.