TELANGANAPATRIKA (JUNE 12) : కొండగట్టు శివారులో గుర్తు తెలియని మృ*తదేహం , జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శివారులో గురువారం గుర్తు తెలియని మృతదేహం వెలుగు చూసింది. వెలమ సంగం సంక్షేమ మండలి సమీపంలో ఉన్న ప్రాంతంలో శ*వం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తర్వాత ఘటన స్థలానికి చేరుకున్న మల్యాల పోలీసులు మృ*తదేహాన్ని పరిశీలించారు. మృ*తుడు 50–55 సంవత్సరాల వయస్సు కలిగిన పురుషుడిగా గుర్తించారు. శ*వం పూర్తిగా డీ కంపోజ్ అయి ఉండటంతో మరిన్ని వివరాలు తెలియరాలేదు.
కొండగట్టు శివారులో గుర్తు తెలియని మృ*తదేహం పోలీసుల దర్యాప్తు ప్రారంభం
ముత్యంపేట కారోబార్ పైడి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు మల్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృ*తుడి వివరాలు ఇప్పటివరకు నిర్ధారించలేకపోయారు. మృ*తుడిని ఎవరికైనా గుర్తుపట్టిన వారు ఉంటే మల్యాల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించమని పోలీసులు సూచించారు.
స్థానికుల్లో ఆందోళన
మృ*తదేహం కనబడటంతో కొండగట్టు పరిసర ప్రాంతాల్లో భయం మరియు చర్చలు మొదలయ్యాయి. మృ*తుడు ఆ ప్రాంతానికి చెందినవాడా? లేక వేరే చోటా వచ్చి మృ*తి చెందాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.