Kondagattu Giri Pradakshina Road: భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన అనుభూతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొండగట్టు గిరి ప్రదక్షిణ రోడ్డు అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 6 కిలోమీటర్ల పొడవు, 50 అడుగుల వెడల్పుతో రహదారిని అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Kondagattu Giri Pradakshina Road రోడ్డు వివరాలు
ఈ గిరి ప్రదక్షిణ రోడ్డులో
3 కిలోమీటర్లు ఘాట్ రోడ్డుగా, మిగతా భాగం మట్టి రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు.
మొత్తం 50 అడుగుల వెడల్పులో
- 30 అడుగులు రోడ్డు,
- 20 అడుగులు ఫుట్‌పాత్‌గా ఉండేలా డిజైన్ చేశారు.
అటవీ భూమి అనుమతులు
ఈ రోడ్డులోని 1,150 మీటర్ల భాగం అటవీ ప్రాంతంలో వస్తోంది. ఇందుకు సంబంధించి అటవీ శాఖ అనుమతి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రతిఫలంగా అటవీ శాఖకు ఎండౌమెంట్ భూమిని కేటాయించనున్నారు. అవసరమైన క్లియరెన్సుల ప్రక్రియ కొనసాగుతోంది.
భక్తులకు మౌలిక సదుపాయాలు
గిరి ప్రదక్షిణ మార్గం వెంట , లైటింగ్ సదుపాయం , పార్కింగ్ స్థలాలు , తాగునీటి సౌకర్యం , మరుగుదొడ్లు , విశ్రాంతి కేంద్రాలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అధికారుల పరిశీలన
సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో రెవెన్యూ, అటవీ, ఆర్ & బి, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులు ప్రతిపాదిత గిరి ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
అరుణాచలం సింహాచలం తరహాలో
కొండగట్టు గిరి ప్రదక్షిణ అభివృద్ధిని అరుణాచలం, సింహాచలం తరహాలో రూపొందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే 40 అడుగుల రోడ్డు, లైటింగ్, అటవీ అనుమతులపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. రాజు గౌడ్, జిల్లా అటవీ అధికారి మడసు రవి ప్రసాద్, జాగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, కొండగట్టు ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ అభివృద్ధి ప్రాజెక్ట్ పూర్తయితే కొండగట్టు వచ్చే లక్షలాది భక్తులకు గిరి ప్రదక్షిణ మరింత సులభం, సురక్షితం కానుంది.
Read More: Read Today’s E-paper News in Telugu
