Komatireddy Venkat Reddy: త్యాగానికి ప్రతీక – తెలంగాణలో బక్రీద్ వేడుకలు..!

Telangana Patrika(jun 7) , Komatireddy Venkat Reddy , బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింలు శనివారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నల్గొండ జిల్లా మునుగోడులోని ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులను కలుసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Komatireddy Venkat Reddy మాట్లాడుతూ –

“బక్రీద్, రంజాన్ పండుగలు త్యాగాలకు ప్రతీకలు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈ పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారు.”

Advertisement

మతసామరస్యం – రాష్ట్ర అభివృద్ధికి అవసరం

మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ రాష్ట్ర ప్రజలు ముందుకు సాగాలన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

Advertisement

“డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేశాం. ఇప్పటికీ అది కొనసాగుతోంది.”

అభివృద్ధికి అడుగులు – స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం

నల్గొండ పట్టణంలో రూ.34 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కేంద్రం ద్వారా మహిళలు, యువత ఉపాధిని పొందగలుగుతారని అన్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

మునుగోడులోని ఈద్గాను కూడా దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని, ముస్లింలకు ఇళ్ల నిర్మాణం, చిన్న వ్యాపారాలకు నిధుల వంటి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి, తహసిల్దార్ హరిబాబు, ఇతర నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →