KK Survey: హైదరాబాద్‌కి చెందిన కేకే సర్వే అండ్ స్ట్రాటజీస్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత స్పష్టమైన ఆధిక్యంలో సర్వే వెల్లడించింది

సర్వే ఫలితాల ప్రకారం —
- బీఆర్‌ఎస్‌కి 55.2% ఓట్లు
- కాంగ్రెస్‌కి 37.8% ఓట్లు
- బీజేపీకి 7% ఓట్లు
అని అంచనా వేయబడింది.
విభాగాలవారీగా బీఆర్‌ఎస్ ఆధిక్యం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఏడు డివిజన్లు ఉన్నాయి — యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, షేక్‌పేట్, శ్రీనగర్ కాలనీ, వెంకల్రావ్‌నగర్, రెహ్మత్‌నగర్, బోరబండ. వీటిలో బీఆర్‌ఎస్ ఎక్కువ చోట్ల స్పష్టమైన ఆధిక్యం సాధించినట్లు సర్వే వెల్లడించింది.
- యూసుఫ్‌గూడలో: బీఆర్‌ఎస్ 47.1%, కాంగ్రెస్ 45.5%, బీజేపీ 7.4%
- ఎర్రగడ్డలో: బీఆర్‌ఎస్ 61.6%, కాంగ్రెస్ 31.7%, బీజేపీ 6.7%
- షేక్‌పేట్‌లో: బీఆర్‌ఎస్ 60.1%, కాంగ్రెస్ 33%, బీజేపీ 6.9%
- శ్రీనగర్ కాలనీలో: బీఆర్‌ఎస్ 61.9%, కాంగ్రెస్ 33.3%, బీజేపీ 4.8%
- వెంకల్రావ్‌నగర్‌లో: కాంగ్రెస్ 48.5%, బీఆర్‌ఎస్ 46.1%, బీజేపీ 5.5%
- రెహ్మత్‌నగర్‌లో: కాంగ్రెస్ 51.1%, బీఆర్‌ఎస్ 45.6%, బీజేపీ 3.3%
- బోరబండలో: బీఆర్‌ఎస్ 63.2%, కాంగ్రెస్ 31.6%, బీజేపీ 5.2%
బోరబండలో బీఆర్‌ఎస్ భారీ ఆధిక్యం
సర్వే ప్రకారం బోరబండలో బీఆర్‌ఎస్‌కు 31.6 శాతం పాయింట్ల ఆధిక్యం ఉండగా, వెంకల్రావ్‌నగర్, రెహ్మత్‌నగర్‌లలో మాత్రం కాంగ్రెస్ స్వల్పంగా ముందంజలో ఉన్నట్లు తేలింది.
KK Survey
మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ పక్షాన గాలి వీచుతోందని, కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించాలంటే మిగిలిన రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచారం అవసరమని సర్వే సూచిస్తోంది.
Read More: Read Today’s E-paper News in Telugu
