తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మలుపు వచ్చింది. కల్వకుంట్ల కవిత నేడు తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీ జెండా ఆవిష్కరిస్తూ Kavitha new party TRS ప్రారంభం చేశారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని ప్రకటించారు.

పార్టీ వివరాలు:
పార్టీ పేరు: తెలంగాణ రాష్ట్ర సేన (TRS)
స్థాపకురాలు: కల్వకుంట్ల కవిత
ప్రకటన తేదీ: ఏప్రిల్ 2026
ముఖ్య డిమాండ్: 5 గ్రామాల వాపసు
లక్ష్యం: సామాజిక న్యాయ తెలంగాణ
కవిత ఏం చెప్పారు?
తెలంగాణ ఏర్పడిన 12 సంవత్సరాలు అయినా ప్రజల కలలు నెరవేరలేదని కవిత వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో బతుకమ్మ తో గ్రామాల్లో తిరిగి ఉద్యమానికి ఊపిరి పోశారని గుర్తుచేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నానని, TRS ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటానని పేర్కొన్నారు.
KCR పై తీవ్ర విమర్శలు
ఉద్యమ రథం దారి తప్పిందని, BRS తెలంగాణ ఆత్మను కోల్పోయిందని కవిత ఆరోపించారు. పేదల ఇళ్లు కూల్చేస్తుంటే KCR మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించని KCR ని “రోబో” అని అభివర్ణించారు. సామాజిక తెలంగాణ స్వప్నాన్ని నెరవేర్చడంలో KCR విఫలమయ్యారని పేర్కొన్నారు.
Kavitha New Party – BJP పై ఆరోపణలు
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన BJP ని కవిత తీవ్రంగా విమర్శించారు. విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చారని BJP పై ఆరోపించారు. తెలంగాణలోని BJP MP లు కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
5 గ్రామాల వాపసు డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణకు వాపసు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని నినదించారు.
తెలంగాణ రాజకీయాలపై ప్రభావం
కవిత కొత్త పార్టీ తెలంగాణ రాజకీయ సమీకరణాలను మారుస్తుందా అనే చర్చ మొదలైంది. BRS నుండి వేర్పడిన కవిత సొంత పార్టీ ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్‌కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.

