Advertisement

Kavitha New Party 2026| శ్రీరామనవమి నాడు తెలంగాణ ప్రజా జాగృతి అధికారిక ప్రకటన – సిద్దిపేట నుంచి ప్రస్థానం!

తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తి ఆవిర్భవించడానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత కల్వకుంట్ల కవిత Kavitha New Party 2026- ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో మార్చి 27న అధికారికంగా ప్రకటించనున్నారు. శ్రీరామనవమి పర్వదినం ఉదయం 8 గంటలకు ఈ ప్రకటన వెలువడుతుందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. తన మెట్టినిల్లు అయిన సిద్దిపేట నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించే అవకాశాలున్నాయి.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Kavitha Siddipet Constituency New Party Launch Telangana Politics Assembly Elections 2026

పార్టీ నమోదు వివరాలు

కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు

తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ప్రక్రియను వేగవంతం చేయాలని ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్టీ నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో అధికారిక ప్రకటన చేయాలని నిర్ణయించారు.

Advertisement

జెండా, గుర్తు, సిద్ధాంతాలు

పార్టీ జెండా, గుర్తు, సిద్ధాంతాలు, విధివిధానాలను సిద్దిపేట నుంచే ప్రకటించే అవకాశాలున్నాయి. పార్టీ ప్రకటన రోజునే తాను సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Kavitha New Party 2026 – లక్ష్యాలు ఏమిటి?

సామాజిక తెలంగాణ సాధన

గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం స్ఫూర్తితో ‘సామాజిక తెలంగాణ సాధించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని కవిత పలుమార్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు, యువతకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇస్తున్నారు.

తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?

ఈ కొత్త పార్టీ ఆవిర్భావంతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. BRS బలహీనపడిన నేపథ్యంలో కవిత పార్టీ ఎంత మంది అనుచరులను ఆకర్షిస్తుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్‌కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →