తెలంగాణ పత్రిక (APR.18) , KARIMNAGAR: గంగాధర మండలం గట్టు బుత్కూర్ గ్రామంలో ని ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వర్క్ సైట్ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో ఇటుక బట్టీల యాజమాన్యాల సహాయంతో గురువారం రోజున 48 మంది విద్యార్థులకు రెండు జతల ట్రాక్ సూట్స్ టీ షర్ట్స్ బ్లేజర్ లను మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందజేశారు.


ఈ సందర్భంగా విద్యార్థుల ముఖాల్లో ఆనందం, ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. విద్యార్థులకు అందించిన దుస్తులు కేవలం దేహానికి సంబంధించినవే కాక, వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించనున్నాయి. దీనివల్ల పాఠశాల కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం మరింతగా పెరగనుంది.ఈ తరహా కార్యక్రమాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల సహకారంతో గ్రామీణ ప్రాంత విద్యార్థుల అభివృద్ధికి మార్గం చూపిస్తున్నాయి. ఇటుక బట్టీల యాజమాన్యం ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమైన విషయం. వారు సమాజ పట్ల తమ బాధ్యతను చాటిచెప్పారు.
అదేవిధంగా లయన్ క్లబ్ ఆఫ్ బాలాజీ నగర్ కరీంనగర్ వారి సంస్థ తరుపున ప్రాథమిక పాఠశాల మరియు వర్క్ సైట్ విద్యార్థులకు మొత్తం 83 మందికి ప్లేటు గ్లాసు వాటర్ బాటిల్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శశికాంత్ రెడ్డి , ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్య ప్రకాష్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకళ , క్లస్టర్ సిఆర్పి మధు, వీవీలు, ఇటుక బట్టీల యజమానులు లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగ సంతోష్ రెడ్డి, కార్యదర్శి రవీందర్ రెడ్డి మరియు సభ్యులు మహిపాల్ రెడ్డి మల్లారెడ్డి లు పాల్గొన్నారు
Read More: Read Today’s E-paper News in Telugu