Advertisement

Kamareddy police: బీబీపేట స్టేషన్‌పై బాధితుల ఆవేదన..

TELANGANA PATRIKA(JUN 5) , Kamareddy police , కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న పంచాయితీ నేపథ్యంలో పోలీసుల నిష్క్రియతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ గ్రామానికి చెందిన డాకూరి సుజాత అనే మహిళ, తనపై దాడి జరిగిందని మూడు రోజుల క్రితమే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ఆన్లైన్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

దాడి, ఫిర్యాదు.. కానీ చర్యలు లేవు!

ఈనెల 3వ తేదీన డాకూరి సుజాత మరియు ఆమె భర్త మోహన్ లపై గ్రామానికి చెందిన డాకూరి శ్రీనివాస్, అమ్రేష్, సత్తవ, నర్సవ్వలు దాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు. కారణం – 1992లో మద్దూరి కృష్ణారెడ్డితో కొనుగోలు చేసిన 65 గజాల మోరి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారని, వర్షపు నీరు బయటకు వెళ్లకుండా అడ్డుకుందని చెప్పారు.

Advertisement

అక్కడి నుంచి సమస్య తలెత్తడంతో మాటలు పెరిగి చేతుల దాకా వెళ్లాయని, ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వచ్చి గాయాల ఫోటోలు తీశారని ఆమె తెలిపారు. కానీ మూడు రోజులు గడిచినా ఆన్లైన్ నమోదు చేయకపోవడం, అధికారుల స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు.

Kamareddy police “ఇది సివిల్ పంచాయితీ” అంటోన్న ఎస్ఐ

బుధవారం నాడు ఆమె భర్త బీబీపేట ఎస్ఐను కలవగా – “ఇది సివిల్ పంచాయితీ… కోర్టులో చూసుకోండి” అని చెప్పారని పేర్కొన్నారు. గురువారం మళ్లీ స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఆన్లైన్ చేయలేదని తెలపగా 100 నెంబర్‌కు కాల్ చేసిన తరువాతే రిసీవ్డ్ కాపీ ఇచ్చారని పేర్కొన్నారు.

Kamareddy police “Fr‌iendly పోలీస్ ఎక్కడ?”

జిల్లాలో Fr‌iendly పోలీసింగ్ కనపడటం లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. “రాజకీయ బలమో డబ్బో ఉంటేనే పోలీస్ స్టేషన్‌లో స్పందన ఉంటుంది” అని ఓ స్థానికుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు.
బాధితురాలు మాట్లాడుతూ – ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →