Kamareddy Food Safety Task Force Raids: పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు

TELANGANAPATRIKA (June 10): Kamareddy Food Safety Task Force Raids. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని పలు రెస్టారెంట్లు, ఫ్లోర్ మిల్స్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ డా. సి. శివలీల ఆదేశాల మేరకు జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు.

Kamareddy Food Safety Task Force Raids పోసానిపేట ఫ్లోర్ మిల్ లో తాత్కాలిక దాడులు

సదాశివనగర్ మండలంలోని వైష్ణవి ఫ్లోర్ మిల్‌లో అపరిశుభ్రత, రికార్డు లోపాలు, వంటపదార్థాలపై ఈగలు, బూజుతో కూడిన గోడలు లాంటి అనేక ఆరోగ్యానికి హానికర అంశాలు గుర్తించి నోటీసులు జారీ చేశారు. సుమారు రూ. 28.5 లక్షల విలువైన 42,500 కిలోల శనగపప్పు లేబుల్ లేకుండా నిల్వ ఉన్నదిగా గుర్తించి సీజ్ చేశారు. శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు.

Advertisement

Advertisement

పర్ణిక ప్యాలెస్, వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్స్ పై దాడులు

Advertisement

ఎన్‌హెచ్ 44 మరియు ఎన్‌హెచ్ 7 రోడ్‌పై ఉన్న హోటల్స్‌లో ఫ్రిజ్‌లలో వెజ్, నాన్ వెజ్ ఉత్పత్తులు కలిపి నిల్వ, బూజు పట్టిన ఫ్యాన్స్, పాత నూనె వాడకం, ఫుడ్ హ్యాండ్లర్ల హైజీన్ లోపాల్లాంటి అంశాలను గుర్తించారు.
పర్ణిక ప్యాలెస్‌ హోటల్‌లో రూ. 45 వేల విలువైన కాలం చెల్లిన పదార్థాలు (బియ్యం, తేనె, ధనియాల పొడి, పుల్ప్) ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను నోటీసులు జారీ చేశారు.

వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్‌ లో ధ్వంసాలు

ఇక్కడ రూ. 17 వేల విలువైన దుర్వాసన మాంసం, గోధుమపిండి, ప్రాన్స్‌లను అక్కడికక్కడే ధ్వంసం చేసి, యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kamareddy Food Safety Task Force Raids అధికారుల హెచ్చరిక

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ హెడ్ వి. జ్యోతిర్మయి మాట్లాడుతూ నిబంధనలు పాటించని వ్యాపారాలపై క్రిమినల్ కేసులు, సీజ్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అని పేర్కొన్నారు. వ్యాపారులు నిబంధనలు పాటించి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →