
TELANGANA PATRIKA(JUN 1) , రాష్ట్ర అవతరణ దినోత్సవం June 2 సందర్భంగా తెలంగాణ పోలీసులకు అవార్డుల వర్షం ను ప్రభుత్వం ప్రకటించింది. హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వుల ప్రకారం, వివిధ విభాగాల్లో సేవలందించిన పోలీస్ సిబ్బందికి మొత్తం 600 మంది పైగా అవార్డులు లభించాయి. ముఖ్యంగా గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన 9 మందికి శౌర్య పతకాలు, 16 మందికి మహోన్నత సేవా, 92 మందికి ఉత్తమ సేవా, 47 మందికి కఠిన సేవా పతకాలు లభించాయి. మిగతా 461 మందికి సాధారణ సేవా పతకాలు ప్రదానం కానున్నాయి.
ఇతర శాఖలకూ గుర్తింపు – సీఎం చేతుల మీదుగా అవార్డులు june 2
అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, ఫైర్ సర్వీసెస్, ఎన్ఫోర్స్మెంట్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు కూడా వివిధ స్థాయిలలో పతకాలు లభించాయి. ఈ పతకాలను తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులు పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకంగా మారతాయని హోం శాఖ తెలిపింది.
Read More: Read Today’s E-paper News in Telugu