తెలంగాణ పత్రిక (APR.29) , IPL 2025: ఐపీఎల్ చరిత్రలో తన ఆటతీరుతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అనేక రికార్డులను తిరగరాసాడు. అతని ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

వైభవ్ సూర్యవంశీ (IPL 2025)సాధించిన కీలక రికార్డులు:
- అత్యంత పిన్న వయస్సులో (14 సంవత్సరాలు 32 రోజులు) టీ20 సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
- ఐపీఎల్ చరిత్రలో భారత్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
- ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు గా నిలిచాడు.
- ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (11) బాదిన భారత ఆటగాడు మురళీ విజయ్ (CSK) రికార్డును సమం చేశాడు.
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడు అయ్యాడు.
- ఐపీఎల్ చరిత్రలో రెండో వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
క్రికెట్ ప్రపంచంలో చరిత్ర సృష్టించిన వైభవ్
IPL 2025 లో తన సునాయాసమైన బ్యాటింగ్, ధాటిగా సిక్సర్లు బాదే నైపుణ్యంతో వైభవ్ సూర్యవంశీ క్రికెట్ రంగాన్ని ఓ కొత్త దిశగా తీసుకెళ్తున్నాడు. ఈ రికార్డులు అతని కెరీర్ ప్రారంభ దశలోనే రావడం అతని భవిష్యత్తు మరింత గొప్పగా ఉంటుందని సంకేతాలిస్తోంది.
Read More: Read Today’s E-paper News in Telugu