తెలంగాణ పత్రిక (MAY 01) , IPL 2025 చివరిగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన చెన్నై, ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తొలుత నిష్క్రమించిన జట్టుగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన CSK 191 పరుగులు చేసినా, PBKS 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ ఓపెనర్ ప్రభుసిమ్రన్ 54 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా 72 పరుగులతో జట్టును విజయపథంలో నడిపించారు. చెన్నై బౌలర్లలో ఖలీల్, పతిరణ తలో రెండు వికెట్లు తీశారు. అయితే ఈ విజయంతో పంజాబ్ ఫలితాల పట్టికలో మరింత ముందుకు సాగింది.

IPL 2025 లో చెన్నై చెత్త రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఇది నిరాశపరిచే వార్త. IPL 2025లో చెన్నై జట్టు చరిత్రలోనే చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ సీజన్‌లో చెపాక్ స్టేడియంలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములు చెందడం ద్వారా ఒకే సీజన్‌లో సొంత మైదానంలో అత్యధిక పరాజయాల రికార్డును సొంతం చేసుకుంది. 2008, 2012లో నాలుగు ఓటములతో ఉన్న రికార్డును అధిగమించింది.ఈ ఓటమిపై ధోనీ స్పందిస్తూ, జట్టు బ్యాటింగ్ మెరుగ్గా చేసినప్పటికీ చివరి ఓవర్లలో మరిన్ని పరుగులు చేయాల్సిందని, అది తడబడిన కారణంగా మ్యాచ్ కోల్పోయినట్టు తెలిపారు. సామ్ కరన్, బ్రెవిస్ లు బాగా ఆడారని కొనియాడారు.
Read More: Read Today’s E-paper News in Telugu