Inter-State Border Checkpost: చెక్ పోస్ట్ తనిఖీలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్..

TELANGANA PATRIKA(MAY27) , కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామపురం ఎక్స్‌ రోడ్డు వద్ద ఉన్న ఆంధ్రా – తెలంగాణ అంతర రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Advertisement

Inter-State Border Checkpost తనిఖీలు 24 గంటల పాటు మూడువిడతల్లో..

వాహనాలను పరిశీలించిన అనంతరం చెక్‌పోస్ట్ సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ –
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి, అక్రమంగా సన్న వరి, మద్యం, గంజా, పిడీఎస్ బియ్యం, మరియు ముఖ్యంగా పశువుల రవాణా పూర్తిగా నిరోధించాలని ఆదేశించారు.
ఈ ప్రత్యేక తనిఖీలు పోలీసు, రెవెన్యూ, అగ్రికల్చర్, పశువైద్య, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో ఆరు చెక్ పోస్ట్‌ల్లో 24 గంటల పాటు మూడు విడతల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.

Advertisement

బక్రీద్ నేపథ్యంలో పశువుల రవాణాపై పకడ్బందీ చర్యలు

బక్రీద్ పండుగ దృష్ట్యా పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు.
వ్యవసాయ అవసరాల నిమిత్తం పశువులు తరలించే వారు సంబంధిత పశు వైద్యాధికారుల అనుమతులు తప్పనిసరిగా కలిగి ఉండాలని, గాయాలు కలిగించే రీతిలో అధిక సంఖ్యలో రవాణా చేయవద్దని హెచ్చరించారు.

Advertisement

తనిఖీల్లో పాల్గొన్న అధికారులు

ఈ తనిఖీల సమయంలో ఎస్పీ నరసింహ వెంట కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, ఎస్‌ఐ అనిల్, చెక్ పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భద్రతే ముఖ్యమని, ఎవరి మీదైనా అనుమానం వచ్చినపుడే కాకుండా, ప్రతి వాహనాన్ని సమగ్రంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →