Instagram Scam Alert: హైదరాబాద్ లోని లక్దీకాపుల్ కు చెందిన 46 ఏళ్ల వ్యక్తి ఒక ఆన్‌లైన్ స్కామ్ కు బలవుతున్నాడు. త్వరగా డబ్బు సంపాదించొచ్చని భావించి, ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా ప్రమోట్ చేసిన ఓ ఫేక్ స్టాక్ ట్రేడింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టాడు. దీని ఫలితంగా అతను రూ.9.7 లక్షలు కోల్పోయాడు.

Instagram Scam Alert ఏం జరిగింది?
ఈ సంఘటనలో:
బాధితుడు ఇన్స్టాగ్రామ్ లో ఓ రీల్ చూశాడు. అందులో NOMURA అనే యాప్ ఉపయోగించి స్టాక్ ట్రేడింగ్ ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చని ప్రచారం చేశారు. ఆ రీల్ లోని నెంబర్ కు కాల్ చేశాడు. వెంటనే అతన్ని ఒక వాట్సాప్ గ్రూప్ లో చేర్చారు. అక్కడ, “నేహా ఐయ్యర్” అనే మహిళ అతనికి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇచ్చింది.
స్కామ్ ఎలా పనిచేసింది?
స్కామర్స్ క్రింది విధంగా బాధితుడిని నమ్మించారు:
- అతను రూ.9,65,400 యాప్ లో పెట్టుబడి పెట్టాడు.
- యాప్ అతని ఖాతాలో రూ.27.5 లక్షల ఫిక్షనల్ ప్రాఫిట్స్ చూపించింది.
- డబ్బు విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా, అతని ఖాతాను బ్లాక్ చేశారు.
- తర్వాత, రూ.18 లక్షలు అదనపు ఫీజుగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
- ఈ సమయంలో అతను స్కామ్ గురించి అర్థం చేసుకుని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read More: Read Today’s E-paper News in Telugu
