
TELANGANA PATRIKA (MAY 19) , ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
సోమవారం దుగ్గొండి మండలం లోని రేకంపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద ఇండ్లు నిర్మించుకుంటున్న రంపిసా అశ్వినీ, రంపిసా కళావతి లతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం నిర్మాణ ప్రక్రియ వేగవంతం
లబ్ధిదారుల ఖాతాలో బేస్మెంట్కు లక్ష, రూఫ్ లెవల్ బిల్లు మొత్తం 2 లక్షలు రూపాయలు జమచేయడం జరిగిందని, నిర్మాణం పూర్తి కాగానే మిగతా రూ 3 లక్షలు జమ చేస్తామని కలెక్టర్ అన్నారు. ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నుండి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అయినందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
కలెక్టర్ వెంట ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్, రవిచంద్ర రెడ్డి,ఎంపిడిఓ అరుంధతి ,ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఇసుక మాఫియా: కదలికలపై కన్నేసిన అధికారులు – పలుచోట్ల ట్రాక్టర్లు పట్టివేత
One Comment on “ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రగతిపై సమీక్ష – కలెక్టర్ డా. సత్య శారద కీలక ఆదేశాలు”