Indigo Flight Cancellations: దేశీయ విమానయాన రంగాన్ని ఒక్కసారిగా కలవరపెట్టేలా ఇండిగో భారీ ఆపరేషనల్ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపింది. వరుసగా నాలుగు రోజులుగా వందలాది విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు చిక్కుల్లో పడ్డారు. అందుబాటులో సీట్లు తగ్గిపోవడంతో టికెట్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. కొన్ని మార్గాల్లో ఒకవైపు ప్రయాణానికి కూడా ₹1,00,000 దాటే ధరలు నమోదు కావడం ప్రజలను షాక్‌కి గురిచేసింది.

హైదరాబాద్‌లోనే 66 విమానాలు రద్దు
శనివారం ఒక్కరోజులో హైదరాబాద్ RGI ఎయిర్‌పోర్ట్‌లో 66 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఢిల్లీ, ముంబై, బంగళూరు, చెన్నై, గోవా, విశాఖ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది.
దేశీయ టికెట్ ధరలు ఆకాశమే హద్దుగా
- హైదరాబాద్ → భోపాల్: సాధారణంగా ₹5,000 – ₹10,000 కానీ ఇప్పుడు ₹1,03,000
- దిల్లీ → బంగళూరు: ₹8,000 – ₹10,000 రూట్ఇప్పుడు ₹90,000 దగ్గర
- కోల్‌కతా → బంగళూరు: ₹1,00,000 వరకు
- దిల్లీ → ముంబై: ₹60,000 వరకు పెరిగింది
అంతర్జాతీయ రూట్లు చవక దేశీయ రూట్లు మహా ఖరీదు
ఇది ప్రజలకు అసలు నమ్మలేని పరిస్థితి.
అదే రోజుల్లో…
- దిల్లీ → లండన్: ₹25,000
- బెంగళూరు → దుబాయ్: ₹15,000
అంటే, విదేశీ ప్రయాణం దేశీయ ప్రయాణం కన్నా చవకగా మారింది.
సంక్షోభానికి కారణం పైలట్ల కొరత
డీజీసీఏ అమలు చేసిన కొత్త Flight Duty Time Limitations (FDTL) వల్ల పైలట్ల పని గంటలపై కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇందువల్ల ఇండిగోలో పైలట్లు సరిపోకపోవడంతో:
పెద్ద సంఖ్యలో విమానాలు నిలిపివేత , ఆపరేషన్లు తీవ్రంగా దెబ్బతినడం , దేశవ్యాప్తంగా సీట్ల కొరత
ఈ ఒత్తిడి మొత్తం ప్రయాణికుల మీద పడింది.
Indigo Flight Cancellations ప్రయాణికులు నిరాశతో ఎయిర్‌లైన్స్ వద్ద సీట్లు లేవు
Air India, Vistara, SpiceJet లాంటి విమానాల్లో సీట్లు దొరకలేకపోవడంతో ప్రజలు స్టేషన్లలో, ఎయిర్‌పోర్ట్‌లలో ఇరుక్కుపోయారు. డైనమిక్ ప్రైసింగ్ వల్ల కొద్ది సీట్లకే భారీ ధరలు వర్తించాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
