Advertisement

Indians stranded in Iraq 2025: Iraqలో చిక్కుకున్న భారతీయులకు రక్షణ కోరిన ఓవైసీ – వెంటనే స్పందించండి

Telanganapatrika (June 18): Indians stranded in Iraq 2025, Indians stranded in Iraq 2025 సంఘటనపై AIMIM ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని స్పందించాలంటూ గట్టి విజ్ఞప్తి చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఐరాక్‌లో పర్యటిస్తున్న సుమారు 120 మంది భారతీయ శియా ముస్లింలు అక్కడే చిక్కుకుపోయారని, వారు తిరిగి దేశానికి రాలేకపోతున్నారని వెల్లడించారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
Indians stranded in Iraq 2025

Indians stranded in Iraq 2025 Details

ఓవైసీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భారతీయులు శియా మతస్థులు కాగా, పవిత్ర యాత్ర కోసం ఐరాక్ వెళ్లారు. అయితే, ఇరాన్‌కు పొరుగున ఉన్న ఐరాక్ నుంచే విమానాల రాకపోకలు నిలిపివేయడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. దీనిపై మంగళవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ ఆఫ్ ఎక్సటర్నల్ అఫైర్స్ సమావేశంలో ఓవైసీ అధికారులతో మాట్లాడారు.

Advertisement

వారిని కువైట్‌ ద్వారా భారత్‌కు తీసుకురావాలని ఓవైసీ కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఆ 120 మందికి ఇ-వీసా లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా వారు కువైట్‌ నుంచి తిరిగి విమానాల ద్వారా భారత్ చేరుకోవచ్చని ఓవైసీ తెలిపారు.

విమాన సౌకర్యాలు లేక పోవడమే కాకుండా, మతపరమైన వాతావరణంలో కూడా ఈ యాత్రికులకు ఆపదలు ఎదురయ్యే అవకాశముండటంతో తక్షణ చర్య తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →