Telanganapatrika (July 07): India vs England, టీమ్ ఇండియా ఇంగ్లండ్‌పై 2వ టెస్టులో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ మలుపు తిప్పిన కీలకమైన అంశం జడేజా వేసిన 95 సెకన్ల ఓవర్ కావడం విశేషం.

India vs England అంతా ఆ ఒక్క సెకన్ల ఆటలోనే జరిగింది…
లంచ్ బ్రేక్‌కు మూడు నిమిషాలు (180 సెకన్లు) మాత్రమే ఉండగా, జడేజా తన ఓవర్‌ను కేవలం 95 సెకన్లలో పూర్తి చేశాడు.
దీంతో, అదనంగా ఒక ఓవర్ వేసే అవకాశం వచ్చింది – అది కూడా లంచ్‌కు ముందు.
మ్యాచ్ టర్నింగ్ పాయింట్:
అదే అదనపు ఓవర్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేయగా,
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను అవుట్ చేసి,
టీమ్ ఇండియా దెబ్బ తీసింది.
ఈ ఒక్క వికెట్‌తో ఇంగ్లండ్ పతనం మొదలైంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరికి 336 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇది విదేశాల్లో భారత్ కు ఇదివరకు ఎప్పుడూ లభించని పెద్దతేడా విజయంగా రికార్డు అయ్యింది.
Read More: Read Today’s E-paper News in Telugu