Telanganapatrika (జూలై 21): IMD Rainfall Alert Telangana 2025, హైదరాబాద్ సహా తెలంగాణలోని అనేక జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్, యెల్లో అలర్ట్లు జారీ చేసింది. సోమవారం నుంచి మూడు నుంచి నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

IMD Rainfall Alert Telangana ఆరెంజ్, యెల్లో అలర్ట్ :
- ఆరెంజ్ అలర్ట్ (115.6mm – 204.4mm): అతి భారీ వర్ష సూచన.
- యెల్లో అలర్ట్ (64.5mm – 115.6mm): భారీ వర్ష సూచన.
ఈ హెచ్చరికలు మంగళవారం, బుధవారం రోజులలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని IMD పేర్కొంది.
వర్ష సూచన ఉన్న ముఖ్య జిల్లాలు:
హైదరాబాద్‌తో పాటు ఈ జిల్లాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి:
- జయశంకర్ భూపాలపల్లి
- ములుగు
- భద్రాద్రి కొత్తగూడెం
- ఖమ్మం
- నల్గొండ
- సూర్యాపేట
- మహబూబాబాద్
- నాగర్‌కర్నూల్
- వనపర్తి
- వరంగల్
- హన్మకొండ
- సిద్దిపేట
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- మెదక్
- కామారెడ్డి
- నిర్మల్
- నిజామాబాద్
- జగిత్యాల
- జనగాం
- యాదాద్రి భువనగిరి
- మెద్చల్ మల్కాజ్గిరి
- వికారాబాద్
జూలై 26 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉంది.
అధికారులు హెచ్చరిక:
వర్షాలు పడే సమయంలో ప్రయాణాలు నివారించాలని, ప్రత్యేకించి తక్కువ ప్రాంతాలు, లోతట్టు కాలనీల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర
Read More: Stalin Movie Re-Release : చిరంజీవి బర్త్‌డే కానుకగా స్టాలిన్ రీ-రిలీజ్..!
