Telanganapatrika (July 12): రాజన్న సిరిసిల్ల జిల్లా , ఇల్లంతకుంట మండలం , గాలి పెల్లి శివారు లోని వరద కాలువ పక్కన ఉన్నటువంటి వరద కాలువ మట్టి అక్రమ తరలింపు అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను , ఒక జెసిబి ని నమ్మదగిన సమాచారం మేరకు ఇల్లంతకుంట పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేసి దాడిలో ట్రాక్టర్లను, జెసిబి ని పట్టుకొని మట్టి తరలించుటకు ఏమైనా అనుమతి ఉందా అని అడుగగా వారు ఎటువంటి అనుమతి పత్రాలు చూపించినందున ఆ యొక్క నాలుగు ట్రాక్టర్లను మరియు జెసిబిని సీజ్ చేశామని ఎస్సై సిరిసిల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.

అనుమతి లేకుండానే వరద కాలువ మట్టి అక్రమ తరలింపు పోలీసులు రెయిడ్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరు కూడా ప్రభుత్వ మరియు ప్రైవేటు భూమిలో తవ్వకాలు మరియు మట్టి తరలింపు జరుపుటకు సంబంధిత శాఖల వద్ద అనుమతి తీసుకోవాలి లేనిచో వారిపైన చట్ట ప్రకారం వాహనాలు సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu