Hyderabadi Haleem Standards : హైదరాబాద్ హలీమ్‌కు కొత్త నిబంధనలు

Hyderabadi Haleem Standards: హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన Hyderabadi Haleem పై ఇప్పుడు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. Food Safety and Standards Authority of India (FSSAI) హలీమ్ తయారీకి సంబంధించి కఠిన ప్రమాణాలను ప్రకటించింది.

ఇకపై హలీమ్ అంటే ఇలా ఉండాలి

Advertisement
Advertisement

Hyderabadi Haleem Standards FSSAI తాజా మార్గదర్శకాల ప్రకారం:

  • హలీమ్‌లో కనీసం 25% మాంసం ఉండాలి
  • మటన్ హలీమ్‌లో కనీసం 8% ప్రోటీన్ ఉండాలి
  • చికెన్ హలీమ్‌లో కనీసం 6% ప్రోటీన్ ఉండాలి
  • ఫ్యాట్ శాతం 12% మించకూడదు అని స్పష్టంగా పేర్కొంది.

తేమ శాతంపై కూడా నియంత్రణ

హలీమ్ నాణ్యత కోసం తేమ (Moisture) శాతానికీ పరిమితులు విధించారు. కొత్త పరిమితులు మటన్ హలీమ్ → 70% తేమ , చికెన్ హలీమ్ → 75% తేమ ఈ ప్రమాణాలను ల్యాబ్ టెస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు.

ఎగుమతులపై ప్రభావం

హైదరాబాద్ నుంచి గల్ఫ్ మరియు అమెరికా దేశాలకు క్యాన్ హలీమ్ ఎగుమతి చేసే వ్యాపారులు ఈ నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశారు. స్లో కుకింగ్ ప్రక్రియ కారణంగా తేమ శాతం ఎప్పుడూ ఒకేలా ఉంచడం కష్టమని వారు FSSAIకి తెలిపారు.

Advertisement

అమలు గడువు పొడిగింపు

ఈ సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని FSSAI కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల అమలు గడువును నవంబర్ 1, 2026 వరకు పొడిగించింది దీంతో ప్రస్తుత 2026 సీజన్‌కు కొంత ఊరట లభించింది.

లేబుల్స్‌పై స్పష్టమైన వివరాలు తప్పనిసరి

ఇకపై హలీమ్ ప్యాకెట్లపై మటన్ హలీమ్ గొర్రె మాంసం (Chevon) హలీమ్ బఫెలో మీట్ హలీమ్ అనే వివరాలు స్పష్టంగా ముద్రించాలి. “మీట్ హలీమ్” అనే సాధారణ పేరు ఉపయోగించడాన్ని FSSAI నిరుత్సాహపరుస్తోంది.

సంప్రదాయం నుంచి ప్రమాణాల దిశగా

ఇప్పటివరకు హలీమ్ రుచి ప్రతి గల్లీకి వేర్వేరుగా ఉండేది. ఉస్తాద్‌ల ప్రత్యేక శైలి, భట్టీ విధానమే ప్రధాన ఆకర్షణ. కానీ ఇప్పుడు ఈ సంప్రదాయ వంటకం కూడా ఫుడ్ స్టాండర్డ్స్ పరిధిలోకి రావడం చర్చనీయాంశమైంది.

హైదరాబాద్ హలీమ్‌కు FSSAI తీసుకొచ్చిన కొత్త నిబంధనలు నాణ్యత నియంత్రణలో కీలక అడుగుగా భావిస్తున్నారు. రాబోయే రంజాన్ నాటికి అన్ని కమర్షియల్ హలీమ్ తయారీదారులు ఈ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →