Telanganapatrika (July 04): Hyderabad Traffic , ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉంది. కానీ అంతే వేగంగా పెరుగుతున్నది ట్రాఫిక్ సమస్య. ముఖ్యంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోయింది.

Hyderabad Traffic ఒక కిలోమీటర్‌కు గంట సమయం
నిన్న పీఐహెచ్బీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తాయి. నగరవాసులు “ఒక కిలోమీటర్ దూరానికి గంట సమయం పడుతోంది” అంటూ సోషల్ మీడియా వేదికగా X (Twitter) లో ఫిర్యాదులు చేస్తున్నారు.
వర్షం పడితే నరకం
వర్షపు సీజన్ వచ్చిందంటే ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ నరకంలా మారుతోంది. పేకలపై నడిచేలా మారుతున్న రోడ్లు, స్టాప్‌గోలతో నిలిచిపోయిన వాహనాలు — ఇదీ నగరవాసుల నిత్య జీవితంలో భాగమైంది. రోజుకు 3–4 గంటలు ట్రాఫిక్ లోనే గడుస్తున్నాం అని వాపోతున్నారు.
వృద్ధికి అనుగుణంగా ఇన్ఫ్రా అవసరం
ఐటీ అభివృద్ధితోపాటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వేగంగా అభివృద్ధి చెందాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu