Telanganapatrika (July 6): Hyderabad Muharram Traffic Diversions 2025, హైదరాబాద్ ముహర్రం ఊరేగింపు 2025 – ట్రాఫిక్ మార్గాలు, ప్రజలకు సూచనలు, హైదరాబాద్ నగరంలో జూలై 6న జరిగే బీబీ కా ఆలం ముహర్రం ఊరేగింపును పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీస్ శాఖ కీలక మార్గాలలో భారీ ట్రాఫిక్ మార్పులను ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఊరేగింపు జరగనుండగా, పాతబస్తీ, చాదర్ ఘాట్, నాయాపూల్, సలార్ జంగ్ మ్యూజియం, సికింద్రాబాద్ ప్రాంతాలలో ట్రాఫిక్ ప్రభావితం కానుంది.

ముఖ్యమైన మార్గాలపై ట్రాఫిక్ డైవర్జన్లు
- బీబీ కా అలోవా వద్ద సునర్ గల్లీ ‘టి’ జంక్షన్ నుండి ఎంట్రీ నిలిపివేయబడుతుంది. ట్రాఫిక్ దబీర్‌పురా దర్వాజా వైపు మళ్లించబడుతుంది.
- షేక్ ఫైజ్ కమాన్ వద్ద జబ్బార్ హోటల్ నుండి ట్రాఫిక్ చంచల్ గూడ లేదా దబీర్‌పురా వైపు మళ్లించబడుతుంది.
- ఇథెబార్ చౌక్ నుండి బడా బజార్ వైపు వెళ్లే ట్రాఫిక్‌కు అనుమతి లేదు.
- మొఘల్ పురా, వోల్టా హోటల్ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు బీబీ బజార్ ఎక్స్ రోడ్స్ వద్ద diverted.
- చార్మినార్ వైపు ట్రాఫిక్ మిట్టీ కా షేర్ వద్ద diverted చేయబడుతుంది.
మిర్ ఆలం మండీ, సలార్ జంగ్ మరియు చాదర్ ఘాట్ ట్రాఫిక్
- చాదర్ ఘాట్, నూర్ ఖాన్ బజార్ నుండి ట్రాఫిక్ సలార్ జంగ్ రోటరీ వద్ద diverted.
- APSRTC బస్సులు 10AM నుండి 9PM వరకు రంగా మహల్, అఫ్జల్ గంజ్ మార్గంగా మళ్లించబడతాయి.
సికింద్రాబాద్ ట్రాఫిక్ డైవర్జన్లు (4:00 PM – 8:30 PM)
- ట్యాంక్ బండ్ నుండి కర్బలా మైదాన్ వైపు వెళ్లే వాహనాలు చిల్డ్రెన్స్ పార్క వద్ద Kavadiguda, బైబిల్ హౌస్, RP రోడ్ వైపు మళ్లించబడతాయి.
- MG రోడ్ మధ్యలో ఒకవైపు మార్గంగా మార్చబడుతుంది.
Hyderabad Muharram Traffic Diversions 2025 ప్రజలకి సూచనలు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముహర్రం వేడుకల సమయంలో ప్రజల సహకారం కోరుతూ, అత్యవసర పరిస్థితుల కోసం 9010203626 నంబరును సంప్రదించవచ్చు. ప్రత్యామ్నాయ మార్గాలు, లైవ్ ట్రాఫిక్ సమాచారం కోసం అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను అనుసరించండి.
తాజా అప్డేట్స్ కోసం ఇంకా www.telanganapatrika.in ను ఫాలో అవ్వండి