Telanganapatrika (July 6): AP EAMCET 2025, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) ఆధ్వర్యంలో AP EAMCET/EAPCET 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 7, 2025 నుంచి ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.in/EAPCET ద్వారా రిజిస్ట్రేషన్ చేయవచ్చు.

ఈసారి మొత్తం సీట్లలో 85 శాతం స్థానిక అభ్యర్థులకు, మిగతా 15 శాతం స్థానికేతరులకు కలిపి కేటాయించనున్నారు.
| ఈవెంట్ | తేదీలు |
|---|---|
| ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు & రిజిస్ట్రేషన్ | జూలై 7 నుండి 16 వరకు |
| అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ | జూలై 7 నుండి 17 వరకు |
| వెబ్ ఆప్షన్లు | జూలై 13 నుండి 18 వరకు |
| ఆప్షన్లలో మార్పు | జూలై 19 |
| సీటు అలాట్మెంట్ ఫలితం | జూలై 22 |
| కాలేజ్‌లో రిపోర్టింగ్ | జూలై 23 నుండి 26 వరకు |
AP EAMCET 2025 ఫీజు వివరాలు:
- OC/BC: ₹1200
- SC/ST: ₹600
అర్హత ప్రమాణాలు:
- 2025 డిసెంబర్ 31 నాటికి కనీసం 16 ఏళ్ల వయసు ఉండాలి.
- Pharm D కోర్సుకు కనీసం 17 ఏళ్ల వయసు ఉండాలి.
- ట్యూషన్ రీయింబర్స్‌మెంట్ కోసం OCకి గరిష్ట వయసు 25 ఏళ్లు, ఇతరులకు 29 ఏళ్లు (జూలై 1 నాటికి).
ప్రత్యేక గమనిక:
AP EAPCET-2025లో అర్హత సాధించినా ర్యాంక్ రాని అభ్యర్థులు, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు జూలై 8 సాయంత్రం 5 గంటలలోపు (10+2 మార్కుల ఆధారంగా) డిక్లరేషన్ ఫార్మ్ సమర్పించాల్సి ఉంటుంది.
మీరు అర్హులైతే ఈ అవకాశాన్ని మిస్ కాకండి!
తాజా అప్‌డేట్స్ కోసం ఇంకా www.telanganapatrika.in ను ఫాలో అవ్వండి
