Telanganapatrika (June 28): Husnabad Politics. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఘాటు విమర్శలు, ప్రత్యక్ష దూషణలు చెలరేగాయి. బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ప్రస్తుతం ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Husnabad Politics “మసి పూసి మారేడు కాయ” – మంత్రుల పర్యటనపై ఎద్దేవా
సతీష్ కుమార్ మాట్లాడుతూ, “నలుగురు మంత్రుల పర్యటన ప్రజల్ని మోసం చేసే డ్రామా. కొత్తగా ఏ పనికీ మంజూరు లేకపోయినా, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకే శిలాఫలకాలు పెట్టి అభివృద్ధి అంటూ తప్పుడు ప్రచారం చేయడం కాంగ్రెస్ పార్టీ కపటనాటకానికి నిదర్శనం” అని విమర్శించారు.
“కాంగ్రెస్ హయాంలో కబ్జాలు, దోపిడీ” – సతీష్ ఆరోపణలు
“నేడు హుస్నాబాద్ ప్రాంతం కబ్జాలకు, దోపిడీకి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. పోలీస్ పోస్టింగ్లు, రెవెన్యూ పోస్టింగుల కోసం డబ్బుల లావాదేవీలు జరుగుతున్నాయి” అని ఆరోపించారు. తన హయాంలో అవినీతి లేకుండా పాలన సాగిందని ఆయన పేర్కొన్నారు.
“కుట్ర రాజకీయాలు – అభివృద్ధిని గౌరవించని ప్రభుత్వం”
పొన్నం ప్రభాకర్ ఇంజనీరింగ్ తరగతుల నిర్వహణకు ఇప్పటికే ఉన్న పాలిటెక్నిక్ భవనాన్ని ఉపయోగిస్తున్నారని, అదే తాను నిర్మించించిన భవనమని పేర్కొన్నారు. మాత శిశు ఆసుపత్రి, బాలికల కళాశాల, మినీ కలెక్టరేట్, తదితర అభివృద్ధి పనులన్నీ గత ప్రభుత్వం హయాంలోనే పూర్తయ్యాయని, ఇప్పుడు వాటిని తమ హక్కుగా చూపించడాన్ని ఖండించారు.
“సూర్యుడిపై ఉమ్మేయడం లాంటిదే!”
“తాను అభివృద్ధి చేసిన హుస్నాబాద్‌పై ఇప్పుడు విమర్శలు చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మేయడమే” అని కించపరిచారు. “దొడ్డిదారిలో గెలిచిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అభివృద్ధి అర్థం కాదు” అని ఎద్దేవా చేశారు.
Husnabad Politics నిజాలు vs ఆరోపణలు – ప్రజల తీర్పే చివరి మాట
ఈ రాజకీయ బాహుబలికి నేపథ్యంగా, ఒకవైపు బిఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలు, మరోవైపు ప్రస్తుత మంత్రుల పనితీరు పై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఎన్నికలకు ముందు హాట్ టాపిక్ అవుతుంది.
“2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిజాయితీకి ఓటేస్తారా? లేక మాటలకే మెడలిస్తారా?” అనే ప్రశ్న ఇప్పుడు హుస్నాబాద్ ప్రజల ముందుంది.
Read More: Read Today’s E-paper News in Telugu